Sunday, 15 June 2014

1. వేదాంతం విజిల్ వేస్తుంది
    మనసు విచారంలో ఉన్నప్పుడు -16/06/14

2. కరిగిపోతున్నా కర్పూరంలా
    నీ ప్రేమ కోసం ఎదురుచూస్తూ

3. ప్రేమ అనేది టైం పాస్ కాదు
    పెళ్ళితో నీ టైం ఏమి ముగియబోదు 

4. నిరంతరం శ్రమిస్తున్నా 
   నిరీక్షణే ఎదురవుతున్నా - 17/06/14

5. ఆరాటం పడుతున్నా 
   పోరాటం అడ్డొస్తుంది - 17/06/14

6.కనురెప్ప వాలదు
  కునుకును వాలనీయదు-18july14 


7.ఆహ్వానం చెప్పాలనిఉంది
  మరి నీ అహ్వానం జవాబునిస్తుందా!-18july14


8. మనసు మాయల పొర 
    అబద్దాలని  నిజాలుగా చేస్తుంది -


9. ఎదురుచూపులలో 
    ఎదుగుతున్న చూపరులెందరో ll 21JULY14 ll

10. నీ ప్రేమ కుసుమం లో 
     పుప్పొడి నేనై జీవిస్తున్నా  ll 21JULY14 ll


11. కలిసిపోయే గతంలో
      ప్రస్థుతమై నా పరిచయం  ll 21JULY14 ll